** YSR Vardhanthi Across The World. కర్నూల్ వరద భాదితులకు 'తానా' చేయూత. నల్ల బియ్యంతో గుండెజబ్బులు దూరం !. USA - Thakita Thakita. Tax services. అయ్యారే" అనిపించేనా?. వందలాదిమందికి ఉపాధి దొరుకుతుందనే.. వరుసగా సినిమాలు! _నాగార్జున అక్కినేని. Rupee up 23 paise against dollar. తిరుమలకు కాలినడకు మార్గం మూసివేత. ఒకే రోజు 111కేసులలో తీర్పు. 5 revenue boosters for Desi IT cos.
Latest News
AP Govt.
Sports
Articles
NRI
Gossips
Latest News
Business
Andhra Pradesh
India
International
Science
Greetings
Awards
Festivals
కవితలు
Interview
Photo Feature
Film Review
IT
అతడిది ఓదార్పు మాట... వారిది బ్లాక్ మెయిలింగ్ బాట

               జగన్ పై కాంగ్రెస్ ఆర్ధిక దాడి



Telugu Online(TOL)- Andhra Pradesh Political Article - July.24.2010: వైయస్ జగన్ ను కాంగ్రెస్ అధిష్టానం బ్లాక్ మెయిల్ చేస్తోందా.... అవుననే అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోని నిర్ణయాలను కాంగ్రెసు అధిష్టానం తిరగదోడుతోంది. వివాదాస్పద నిర్ణయాలను, తన వారికి కోట్లాది రూపాయల ఆదాయాలు సమకూర్చే వనరులను కట్టబెట్టారనే ఆరోపణలున్న అంశాలను తిరగదోడుతూ ప్రభుత్వపరంగా జగన్ అతడి కుటుంబ సభ్యులకు వ్యతిరేకమైన నిర్ణయాలకు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా గనుల లీజు వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.


 

 గనుల లీజు వ్యవహారాలు జగన్ వర్గానికి విశేషంగా సంపదను సమకూర్చిపెడుతున్నట్లు ప్రచారం జరుగుతున్న దృష్ట్యా ఈ దిశగా ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. తన బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి గనుల శాఖ మంత్రిగా నియమించడం గనులను కొల్లగొట్టే వ్యూహంలో భాగమేనని అంటున్నారు. వైయస్ నిర్ణయాలను తిరగదోడడం ద్వారా జగన్ ఆర్థిక బలాన్ని నిర్వీర్యం చేయడం, నైతికంగా దెబ్బ తీయడం కాంగ్రెసు అధిష్టానం దూరాలోచనగా తెలుస్తోంది. రోశయ్య ముఖ్యమంత్రి కాగానే దీనికి నాంది పలికారు. కర్నాటక మంత్రి, వైయస్ సన్నిహితుడు అయిన గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం గనుల అక్రమాలపై కూడా అధిష్ఠానం కన్నేసింది. జనార్దనరెడ్డి గనుల తవ్వకాల్లో వైఎస్ వర్గానికి వాటాలున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. దాంతో ఓబుళాపురానికి కాంగ్రెస్ అధిశ్టానం ఆసరాతో ప్రభుత్వం చెక్‌ పెట్టింది. చీమకుర్తి గ్రానైట్‌ వ్యవహారంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్ధమవుతోందని సమాచారం.

 

మరోపక్క ఏకపక్షంగా ఉన్న కొదరు అధికారుల్ని కూడా ప్రభుత్వం పక్కన పెట్టింది, తాము వద్దన్నా ఓదార్పు యాత్ర చేస్తున్న తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు షాక్ ఇవ్వాలనే కాంగ్రెసు నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్ కు సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చినందునే బయ్యారం గనుల లీజును ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఖమ్మం జిల్లా బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఇనుప ఖనిజం లీజును నిలుపుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రోశయ్య స్వయంగా ఈ గనుల ఫైళ్ళను పరిశీలిస్తూ, వైఎస్ వర్గీయుడైన గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని పక్కన పెట్టారు.ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా బయ్యారం గనుల అక్రమాలపై విచారణ జరిపిద్దామని ముఖ్యమంత్రి రోశయ్య సూచించారు. అయితే మంత్రులు వ్యతిరేకించారు.

Related Links

•  YSR Vardhanthi Across The World

•  ఎవరున్నా లేకున్నా జనబలమే మిన్న: జగన్

•  విజయమ్మకు రోశయ్య సానుభూతి లేఖ

•  న్యూజిలాండ్ లో భూకంపం భారీ ఆస్తి నష్టం

•  యాహూ సెర్చ్ ఇంజన్ టాప్ టెన్ జాబితా లో సోనియా,జగన్

•  కర్నూల్ వరద భాదితులకు 'తానా' చేయూత

•  తిండి.. బట్ట.. రొమాన్స్!

•  చెక్ బౌన్స్ కాంట్రవర్సీ‍లో "కొమరం పులి"

•  వైభవోపేతంగా రజనీ తనయ వివాహం!

•  ప్రకాశంలో ప్రారంభమైన ఓదార్పు

Latest news

•  విజయమ్మకు రోశయ్య సానుభూతి లేఖ

•  పోలీస్ బాస్ గా అరవిందరావు చార్జి స్వీకరణ

•  సమర్ధత నిరూపించుకోండి ... మహిళలకు సీఎం సలహా

•  అక్రమాలు సహించొద్దు: రోశయ్య హుకుం

•  చిరంజీవి తో ఆనం భేటీ

•  మెట్రో రైలు ప్రాజెక్ట్ కు మంత్రి వర్గం ఆమోదం

•  అతడిది ఓదార్పు మాట... వారిది బ్లాక్ మెయిలింగ్ బాట

•  అసెంబ్లీ హాల్లో వైఎస్సార్ చిత్రపటం ఆవిష్కరణ

•  బర్త్ డే బోయ్ రోశయ్యకు అరుదైన గౌరవం

•  పించన్లు పెంచేస్తే పోలా ?

Head Lines
eSeva|| Food|| Grocery|| Tourism|| Travel|| Yoga|| Contact us|| Advertise|| Contribute|| FeedBack
Contact: CEO - venu@teluguonline.net, editor@teluguonline.net 
Copyright © 2009-2010www.teluguonline.net. All rights reserved.
No part of this site should be used in any other media without prior permission.
IT & Technical support by - Krify