Telugu Online(TOL)- Andhra Pradesh News- July.28.2010:తెలంగాణలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో సగటున 64.2 శాతం పోలింగ్ జరిగినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఐ.వి.సుబ్బారావు వెల్లడించారు. ఆయన మంగళవారం సాయంత్రం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ అంతా ప్రశాంతంగా ముగిసిందన్నారు.

పోలింగ్ సక్రమ నిర్వహణకు పోలీసుఖ బాగా సహకరించిందన్నారు. పోలీసు యంత్రాంగాన్ని గట్టి భద్రత కల్పించినందుకు ఆయన అభినందించారు. చెన్నూరులో 71 శాతం, కోరుట్లలో 70 శాతం, మంచిర్యాలలో 71 శాతం, ఎల్లారెడ్డిలో 70 శాతం, నిజామాబాద్ అర్బన్‌లో 52 శాతం, ధర్మపురిలో 62 శాతం, వేములవాడలో 55 శాతం, సిరిసిల్లలో 60 శాతం, హుజురాబాద్‌లో 69 శాతం, సిద్ధిపేటలో 71 శాతం, వరంగల్ పశ్చిమలో 54 శాతం పోలింగ్ జరిగిందని ఐ.వి.సుబ్బారావు తెలిపారు.