Telugu Online(TOL)- Andhra Pradesh Political News-July.28.2010:ఢిల్లీలోని మెట్రో రైలు కంటే మన హైదరాబాద్ లో ప్రవేశపెట్టే మెట్రో రైలులో మరిన్నిఅధునాతన సౌకర్యాలను సమకూర్చుతామని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే సజావుగా పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. దీనిపై ప్లానింగ్ కమిషన్ కూడా మన ప్రభుత్వాన్ని అభినందించిందని సీఎం తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కోరినట్టు ఏ సమస్య అయినా అక్కడికక్కడే పరిష్కరించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ బాబ్లీ ప్రాజెక్టు సమస్యను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అక్కడికక్కడే పరిష్కరించాలని చంద్రబాబు కోరడం అహేతుకమని విమర్శిందారు.