** YSR Vardhanthi Across The World. కర్నూల్ వరద భాదితులకు 'తానా' చేయూత. నల్ల బియ్యంతో గుండెజబ్బులు దూరం !. USA - Thakita Thakita. Tax services. అయ్యారే" అనిపించేనా?. వందలాదిమందికి ఉపాధి దొరుకుతుందనే.. వరుసగా సినిమాలు! _నాగార్జున అక్కినేని. Rupee up 23 paise against dollar. తిరుమలకు కాలినడకు మార్గం మూసివేత. ఒకే రోజు 111కేసులలో తీర్పు. 5 revenue boosters for Desi IT cos.
Latest News
AP Govt.
Sports
Articles
NRI
Gossips
Latest News
Business
Andhra Pradesh
India
International
Science
Greetings
Awards
Festivals
కవితలు
Interview
Photo Feature
Film Review
IT
ధరలపై దద్దరిల్లిన ఉభయసభలు

Telugu Online(TOL)- India Political  News - July.28.2010:నిత్యావసరాల ధరల పెంపుపై పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం దద్ధరిల్లాయి. పెరిగిన ధరలతో దేశ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నాయని, ఈ అంశంపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి.యూపీఏ భాగస్వామ్య పక్షాలైన తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే కూడా ఈ అంశంలో  ప్రతిపక్ష పార్టీలతో గొంతు కలిపాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్లు మీరా కుమార్ (లోక్‌సభ), హమీద్ అన్సారీ (రాజ్యసభ)లు ప్రతిపక్షాల మాటను తోసిపుచ్చి సభను సజావుగా నడిపించేందుకు శతధా ప్రయత్నించి విఫలమయ్యారు.



ప్రతిపక్షాలు పట్టువీడక పోవడంతో ఉభయ సభలను బుధవారానికి వాయిదా వేశారు. సభ ప్రారంభమైన వెంటనే యూపీయే పక్షాలైన ఎస్పీ, ఆర్జేడీలు ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి ధరలపై చర్చకు డిమాండ్ చేశాయి. నిత్యావసర వస్తు ధరలతో పాటు, పెట్రో వడ్డన, కిరోసిన్, వంటగ్యాస్ ధరలను పెంపుపై చర్చకు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.  ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ప్రసంగిస్తూ పెంచిన పెట్రోల్, డీజల్, కిరోసిన్, వంటగ్యాస్ ధరల వల్ల సామాన్య ప్రజానీకం జీవనం దుర్భరమైందన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి దీనిపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయన్నారు. అందువల్ల తమ వాయిదా తీర్మానాలను ఆమోదించి, చర్చకు అనుమతించాలని కోరారు.


ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న  భాగస్వామ్య పక్షాలు కూడా చర్చ సాగాలని కోరుతున్నాయని తెలిపారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి బాబ్లీ ప్రాజెక్టు అంశాన్ని లేవనెత్తారు. దీంతో సభను 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ.. విపక్ష సభ్యులు ఏమాత్రం శాంతించకపోవడంతో మర్నాటికి వాయిదా వేస్తూ సభాపతులు నిర్ణయం ప్రకటించారు.

Related Links

•  YSR Vardhanthi Across The World

•  ఎవరున్నా లేకున్నా జనబలమే మిన్న: జగన్

•  విజయమ్మకు రోశయ్య సానుభూతి లేఖ

•  న్యూజిలాండ్ లో భూకంపం భారీ ఆస్తి నష్టం

•  యాహూ సెర్చ్ ఇంజన్ టాప్ టెన్ జాబితా లో సోనియా,జగన్

•  కర్నూల్ వరద భాదితులకు 'తానా' చేయూత

•  తిండి.. బట్ట.. రొమాన్స్!

•  చెక్ బౌన్స్ కాంట్రవర్సీ‍లో "కొమరం పులి"

•  వైభవోపేతంగా రజనీ తనయ వివాహం!

•  ప్రకాశంలో ప్రారంభమైన ఓదార్పు

Latest news

•  యాహూ సెర్చ్ ఇంజన్ టాప్ టెన్ జాబితా లో సోనియా,జగన్

•  వైభవోపేతంగా రజనీ తనయ వివాహం!

•  నాలుగోసారి పార్టీ సారథ్యం చేపట్టిన సోనియా

•  నిరాడంబరంగా ప్రకాష్ రాజ్ పెళ్ళి

•  మాజీమంత్రి ధరూర్ పెళ్లైంది

•  చర్చలకొసం షరతులు విధించిన కిషన్ జీ

•  కాశ్మీర్ కంటే తెలంగాణ సమస్యే తీవ్రమట !!

•  రోబో చేతులు మారింది !

•  30 కోట్లు పలికిన "రోబో" !

•  బాలీవుడ్ నిర్మాతకు భార్య దేహశుద్ధి !

Head Lines
eSeva|| Food|| Grocery|| Tourism|| Travel|| Yoga|| Contact us|| Advertise|| Contribute|| FeedBack
Contact: CEO - venu@teluguonline.net, editor@teluguonline.net 
Copyright © 2009-2010www.teluguonline.net. All rights reserved.
No part of this site should be used in any other media without prior permission.
IT & Technical support by - Krify