మెదడులో మైక్రోచిప్‍తో అచేతన శరీరానికి చైతన
Telugu Online(TOL)- Health Article - July.05.2010:పక్షవాతం వల్ల అచేతనంగా మారిన అవయవాల్లో కదలిక తెచ్చే సరికొత్త చికిత్సావిధానాన్ని రూపొందించే దిశగా చురుగ్గా ప్రయోగాలు సాగుతున్నాయి. నిశ్చలనంగా పడిఉన్న పక్షవాతం రోగుల మదిలో భావాలను గ్రహించి తదనుగణంగా నాడీవ్యవస్థను చైతన్య పరిచే "మైక్రోచిప్"ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు సెంటీమీటరు వెడల్పులో ఉండే ఈ పలుచని చిప్‍ను మెదడులో అమరుస్తారు. రోగి ఆలోచనను ఇట్టే పసిగట్టేసే ఈ మైక్రోచిప్.. ఆ సంకేతాలను అచేతన అవయవాల కదలికలుగా మార్చేస్తుంది. రోగి ఫలాన విధంగా కదలాలని అనుకున్నప్పుడు వారి మెదడులో కలిగే న్యూరోన్‍ల స్పందనలను ఈ చిప్ టక్కున పట్టేసి విశ్లేషిస్తుంది. తదనుగుణమైన సంకేతాలను అందచేస్తుంది. 
ఉదాహరణకు ఓ పక్షవాతం రోగి ఎదురుగా ఉన్న టీ కప్పును తీసుకోవాలనుకుంటే మెదడులో కలిగిన ఆ యోచన తాలూకా సంకేతాలు కాస్తా వెన్నుముక దగ్గరికి వచ్చేసరికి విచ్చేదనమైపోతాయి. సరిగ్గా ఇక్కడే మైక్రోచిప్ అవసరం వస్తుంది.. అని పరిశోధనా బృందానికి సారధ్యం వహిస్తున్న ప్రొఫెసర్ రోడ్రిగో క్వియాన్ క్విరోగా వెల్లడించారు. అయితే.. వైర్‍లెస్ సాయంతో ఈ మైక్రోచిప్ సేకరించిన సమాచారాన్ని శరీరానికి చేరవేసే ప్రక్రియను పకడ్బందీగా రూపొందించడమే ఇప్పుడు తమ ముందున్న సవాలని ఆయన వెల్లడించారు!
|
| ads |
|
|