** తండ్రి బాటలో తనయుని ప్రసంగం. Dr.YSR Vardhanthi- APINOC, New york. నల్ల బియ్యంతో గుండెజబ్బులు దూరం !. USA - Thakita Thakita. Tax services. కత్తి యుద్ధం !. వందలాదిమందికి ఉపాధి దొరుకుతుందనే.. వరుసగా సినిమాలు! _నాగార్జున అక్కినేని. Rupee up 23 paise against dollar. తిరుమలకు కాలినడకు మార్గం మూసివేత. ఒకే రోజు 111కేసులలో తీర్పు. 5 revenue boosters for Desi IT cos.
Spirituals
News
Events
Composers
Pilgrims
Articles
Press Release
Spiritual Magazine
Tirumula
సీఎం రోశయ్య తిరుపతి పర్యటన షెడ్యూల్ ఇదీ...

Telugu Online(TOL)- Andhra Pradesh News- June.28.2010:ముఖ్యమంత్రి కె.రోశయ్య సోమవారం తిరుపతి పర్యటనకు వెళుతున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరే సీఎం 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు.  విమానాశ్రయ వీఐపీ లాంజ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని అధికార, అనధికార ప్రముఖులతో మాట్లాడతారు.

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ త్వరలో శుంకుస్థాపన చేసే అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతిపాదించిన ఏరియా, అక్కడ బహిరంగ సభ నిర్వహించే స్థల వేదికలను  సీఎం పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఎన్‌టీపీసీ, బీహెచ్ఈఎల్ ప్రాజెక్టు ఏర్పాటవుతున్న మన్నవరం చేరుకొని అక్కడ చేసిన ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు. సాయంత్రం 4.25 గంటలకు హెలికాప్టర్ ‌లోనే బయలుదేరి 4.45 గంటలకు తారకరామ స్టేడియం హెలిప్యాడ్ చేరుకొంటారు. అనంతరం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు.

సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశమవుతారు. 6 గంటలకు తిరుమల కారులో వెళ్తారు. అలిపిరి వద్ద టీటీడీ నిర్మించిన స్విష్ట భవనాన్ని ప్రారంభిస్తారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన కాసేపు విశాంత్రి తీసుకుంటారు. రాత్రి 8 గంటలకు శ్రీవారిని దర్శించుకొని రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. 29వతేదీ ఉదయం 7 గంటలకు కారులో రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరతారు. 8.10 గంటలకు విమానంలో హైదరాబాద్‌ కు పయనమౌతారు.

ads
Related News

eSeva|| Food|| Grocery|| Tourism|| Travel|| Yoga|| Contact us|| Advertise|| Contribute|| FeedBack
Contact: CEO - venu@teluguonline.net, editor@teluguonline.net 
Copyright © 2009-2010www.teluguonline.net. All rights reserved.
No part of this site should be used in any other media without prior permission.
IT & Technical support by - Krify