Telugu Online(TOL)- Telugu Film News- July.16.2010:హిందీలో అమీర్ ఖాన్, కరీనాకపూర్, మాధవన్ నటించగా అసాధారణ విజయం సాధించిన "3 ఇడియట్స్" చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గతంలో సంజయ్ దత్ హీరొగా రూపొందిన "మున్నాభాయ్ ఎం.బి.బి.యస్" చిత్రాన్ని "శంకర్‌దాదా ఎం.బి.బియస్" పేరుతో చిరంజీవితో రీమేక్ చేసి.. దానికి పార్ట్_2గా రూపొందిన "లగే రహో మున్నాభాయ్" చిత్రాన్ని "శంకర్‌దాదా జిందాబాద్" పేరుతో రీమేక్ చేసిన జెమిని ఫిలిం సర్క్యూట్ అనే నిర్మాణ సంస్థ "3 ఇడియట్స్" చిత్రం తమిళ, తెలుగు రీమేక్ హక్కులు స్వంతం చేసుకుంది.

తొలి చిత్రం "జెంటిల్‌మేన్" మొదలుకుని త్వరలో విడుదల కానున్న "రోబో" వరకూ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ స్ట్రయిట్ చిత్రాలే. శంకర్ రూపొందించనున్న తొలి రీమేక్ చిత్రం "3 ఇడియట్స్" అవుతుంది. మరి ఈ ద్విభాషా చిత్రంలో హీరోలుగా నటించే అదృష్టం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి!